: నటి భావనపై జరిగిన దారుణంపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు
దక్షిణాది నటి భావనపై జరిగిన దారుణాన్ని బాలీవుడ్ నటులు తీవ్రంగా ఖండించారు. భావన కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. భానవపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని నటులు వరుణ్ ధావన్, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ తో పాటు పలువురు నటులు పేర్కొన్నారు. నటిపై నిందితులు దుర్మార్గంగా ప్రవర్తించారని వారు అన్నారు. హీరోయిన్ శ్రద్ధాకపూర్ స్పందిస్తూ... ఈ దారుణం గురించి తెలిసి తన గుండె పగిలిందని పేర్కొన్నారు. భారత్‌లో మహిళల భద్రత కోసం ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? అని ఆమె నిలదీశారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకొని మహిళల భద్రత కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.