: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘర్షణపూరిత పరిణామాలపై గవర్నర్ కు నివేదిక సమర్పణ
రెండు రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన అన్ని పరిణామాలపై తనకు సమగ్ర సమాచారం ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తక్షణమే స్పందించిన జమాలుద్దీన్... అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నెల 18న జరిగిన విశ్వాసపరీక్ష సందర్భంగా పలువురు సభ్యులు స్పీకర్ ధన్‌పాల్ పోడియంను ధ్వంసం చేయడం, సభలోని కుర్చీలు, టేబుళ్లు, మైకులు విరగ్గొట్టడం వంటి చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.