: వెంటనే రూ.2 వేల నోట్లను రద్దు చేయండి: రాందేవ్ బాబా
కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం తీసుకొచ్చిన రూ.2000 నోటుపై యోగాగురు రాందేవ్ బాబా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ నోట్ల వల్ల నల్లధనం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన సూచించారు. ఈ రోజు ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ... ఆ నోటును వెంటనే రద్దు చేయాలని అన్నారు. భవిష‌్యత్తులో ఆ నోట్ల వల్ల నల్లధనం మళ్లీ పేరుకుపోయే అవకాశం ఉందని అన్నారు. నల్లధనం నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముందుకు కొనసాగాలంటే ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదని అన్నారు. రూ.2000 నోటును తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.