: తెలంగాణలో మరో కొత్త పార్టీ!
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భంచనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ పార్టీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. సామాజిక తెలంగాణ ఉద్యమ శక్తులతో కలసి ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి టీఎస్ సర్కారు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని... ఏ ఒక్కరినీ గుర్తించడం లేదని, అందుకే పార్టీ పెడుతున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కూడా త్వరలోనే పార్టీ పెడుతున్నట్టు సమాచారం.