: జిహాదీలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో చిక్కుకున్న‌ 3.5 లక్షల మంది చిన్నారులు


ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్‌ నగరంలోకి ప్ర‌వేశించిన సైన్యం అక్క‌డి ఉగ్ర‌వాదుల‌తో భీక‌ర‌పోరులో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డి చిన్నారుల ప‌రిస్థితుల‌పై స్పందించిన‌ లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సేవ్‌ ద చిల్డ్రన్‌ స్వచ్ఛంద సంస్థ ప‌లు వాస్త‌వాల‌ను తెలిపింది. ఈ పోరులో 3.5 లక్షల మంది చిన్నారులు చిక్కుకున్నారని పేర్కొంది. త‌మ ప్ర‌ణాళిక‌లో భాగంగా అంచెలంచెలుగా ముందుకు క‌దులుతూ వ‌చ్చిన ఇరాకీ ద‌ళాలు చివ‌ర‌కి ప‌శ్చిమ మోసుల్ న‌గ‌రంలోకి వ‌చ్చాయి. వారికి అమెరికా సైన్యం కూడా సాయ‌ప‌డింది.

అయితే, ఆ ద‌ళాలు అక్క‌డి చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆపద కలుగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలని  సేవ్‌ ద చిల్డ్రన్‌ స్వచ్ఛంద సంస్థ  కోరింది. ఈ యుద్ధంలో చిక్కుకున్న పిల్ల‌లంతా 18 ఏళ్ల లోపువారేనని పేర్కొంది. ఉగ్ర‌వాదుల చేతికి చిక్కి అక్క‌డే ఉంటున్న పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు అక్క‌డి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయద్దని, అలా చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని సంస్థ ప‌లు సూచ‌న‌లు చేసింది.

  • Loading...

More Telugu News