: హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం ఎదుట ప్రజల ఆందోళన!
హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. పాత నోట్లను తీసుకోవడం లేదంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. పాత నోట్ల మార్పునకు నాగ్ పూర్, చెన్నై వెళ్లాలని ఇక్కడి అధికారులు చెబుతున్నారంటూ ప్రజలు మండిపడ్డారు. చిన్న మొత్తాలను మార్చుకునేందుకు అంత దూరం వెళ్లలేమని, పాత నోట్లను మార్చుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం సబబు కాదు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.