: హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు నయం... జైలు నుంచి శశికళ మరో ఎత్తుగడ!


తమిళనాడులో తన కనుసన్నల్లోనే ఉన్న ప్రభుత్వం ఏర్పడటంతో, సొంత రాష్ట్రంలోని జైలుకు వెళితే, అన్ని పనులనూ చక్కబెట్టుకోవచ్చని భావిస్తూ, కర్ణాటక హైకోర్టులో జైలును మార్చాలన్న పిటిషన్ వేయాలన్న తన ఆలోచనను శశికళ మార్చుకున్నారు. హైకోర్టుకన్నా, సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, జైలు మార్పిడి దిశగా మరిన్ని అవకాశాలు ఉంటాయని ఆమె ఆలోచించినట్టు సమాచారం. భద్రత, తనకున్న అనారోగ్య కారణాలను ప్రస్తావిస్తూ, వేలూరు లేదా చెన్నై జైలుకు మార్చాలని ఆమె పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాదులు నేడో రేపో సుప్రీంలో పిటిషన్ వేయనున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News