: అవార్డులు రాకపోయినా ఫర్వాలేదు: సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ఖాన్


సల్మాన్‌ఖాన్‌ సోదరుడు, నటుడు, దర్శకుడు అర్భాజ్‌ఖాన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా అవార్డుల కోసం సినిమాలు చేయనని అన్నాడు. తన‌కు అవార్డులు రాకపోయినా ఫర్వాలేద‌ని వ్యాఖ్యానించాడు. తాను దర్శకుడిగా కమర్షియల్‌ సినిమాలను చేయాలని అనుకుంటానే త‌ప్ప అవార్డుల కోసం కాద‌ని చెప్పాడు. రొటీన్‌కి భిన్న‌మైన సినిమాను తీయాలని కూడా తాను అనుకోవడం లేదని అన్నాడు.

త‌న అభిప్రాయం ప్ర‌కారం మూవీ బాగుంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతుందని, దానివల్ల అవార్డులు కూడా వస్తుంటాయని అన్నాడు. ‘దబాంగ్‌’ సినిమా విషయానికి వస్తే అదే జరిగిందని, ఆ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుందని, అదే సమయంలో జాతీయ అవార్డు కూడా వచ్చిందని చెప్పాడు. తాను ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాల్లో నటిస్తున్న‌ట్లు, అదే దర్శకుడిగా అయితే మాత్రం జాగ్రత్తగా సినిమాలను తీస్తున్నట్లు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News