: కోనేరు ప్రసాద్ కుమారుడి నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు
ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు ప్రదీప్ ఇంటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్, చెన్నైలో ఉన్న నివాసాలు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వమిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. సీబీఐ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.