: చేనేత సత్యాగ్రహం ప్రారంభం.. సాయంత్రం ఏఎన్యూ వద్దకు చేరుకోనున్న పవన్ కల్యాణ్
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన చేనేత సత్యాగ్రహం, ఐక్య గర్జన ప్రారంభమయ్యాయి. తాము పడుతున్న సమస్యలకు పరిష్కారం డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మైదానంలోకి 60 వేల మంది వచ్చారు. సినీనటుడు, జనసేన అధినేత పవన కల్యాణ్ ఇందులో పాల్గొనడానికి ఈ రోజు సాయంత్రం అక్కడకు రానున్నారు. చేనేత కార్మికులకు సాయంత్రం ఆయన సంఘీభావం ప్రకటించనున్నారు. అనంతరం ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.