: జగన్ పార్టీలో చేరనున్న విజయవాడ బీజేపీ నేత


బీజేపీ నేత యేలేశ్వరపు జగన్మోహన్ రాజు రేపు వైసీపీలో చేరబోతున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. బీజేపీ కోసం తాను ఎంతగానో కష్టపడ్డా, పార్టీలో తనకు గుర్తింపు దక్కలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 2004లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడిగా, పరశురామ సేన వ్యవస్థాపకుడిగా కూడా ఆయన ఉన్నారు. 

  • Loading...

More Telugu News