: ఆన్ లైన్ వినియోగదారులకు శుభవార్త.. నేడు, రేపు ‘మోటో’ భారీ ఆఫర్లు!
ప్రముఖ సెల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా నేడు, రేపు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మోటరోలా యానివర్శరీ సందర్భంగా తమ ఉత్పత్తులను ఈ-కామర్స్ ద్వారా అధికారికంగా విక్రయించే ‘ఫ్లిప్ కార్టు’లో మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో జీ టర్బో ఎడిషన్, మోటీ జీ (సెకండ్ జనరేషన్), మోటో ఎమ్, మోటో ఈ ఫోన్లను ఈ ఆఫర్ల ద్వారా విక్రయిస్తోంది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో ఎమ్ స్మార్ట్ ఫోన్లపై రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ సదుపాయం అందిస్తోంది. అంతేకాకుండా, మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో ఎమ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై రూ.1000, మోటో ఈ, మోటో జీ టర్బో ఎడిషన్లపై రూ.500 డిస్కౌంట్ ఇస్తోంది. మోటో జీ (థర్డ్ జనరేషన్, 8 జీబీ) ఫోన్ ధర రూ. 7,999, మోటో జీ (సెకండ్ జనరేషన్, 16 జీబీ) రూ.6,999 కే విక్రయిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.