: తమకీ సీఎం వద్దే వద్దంటూ గవర్నర్ విద్యాసాగర్ కు తమిళ తంబీల ఈ-మెయిల్స్ వెల్లువ
పళనిస్వామి తమకు సీఎంగా అక్కర్లేదంటూ తమిళ తంబీలు గవర్నర్ విద్యాసాగర్ రావుకు వెల్లువలా ఈ-మెయిల్స్ పంపుతున్నారు. అన్నాడీఎంకే పోరుతో తాము అసంతృప్తికి గురయ్యామని, పళని ముఖ్యమంత్రిగా వద్దని, ఆయన సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సందేశాలను పంపుతున్నారు. మరోవైపు ఆయన్ను తిరస్కరించాలన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సైతం జోరుగా సాగుతోంది. కాగా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన శశికళ, సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సిన వేళ, పళనిస్వామిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాము అమ్మ జయలలితను చూసి ఓట్లు వేశామని, ఈ పళని తమకు సీఎంగా తగిన వాడు కాదని చెబుతూ, వేలాది మంది గవర్నర్ కు మెయిల్స్ పంపుతున్నారు.