: రూ. 2 కోట్ల క్లబ్ లోని బెన్ స్టోక్స్ కు రూ. 14.5 కోట్లు... బిడ్ ముందుకు సాగిందిలా!
ఈ ఉదయం సరిగ్గా 9:53కు బెన్ స్టోక్స్ పేరును ఐపీఎల్ వేలం నిర్వాహకులు ప్రకటించిన తరువాత, అతన్ని సొంతం చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలూ పోటీ పడ్డాయి. తొలుత ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు రంగంలోకి దిగాయి. అందరూ ఊహిస్తున్నట్టుగానే స్టోక్స్ కు బిడ్ రూ. 5 కోట్లను దాటింది. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ రంగంలోకి దిగగా, స్టోక్స్ ధర రూ. 8 కోట్లకు, కింగ్స్ లెవన్ పంజాబ్ పోటీకి రావడంతో ఏకంగా రూ. 10 కోట్లకు పెరిగింది. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ. 13.5 కోట్లను ఆఫర్ చేసింది. స్టోక్స్ ను వదులుకోరాదని భావిస్తున్న పుణె సూపర్ జెయింట్స్, అతని ధరను మరో కోటి పెంచి రూ. 14.5 కోట్లకు సొంతం చేసుకుంది. స్టోక్స్ ను కొనుగోలు చేసిన తరువాత పుణె ఫ్రాంచైజీ వద్ద ఇక మిగిలింది రూ. 3 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.