: సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త!
బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త. పెద్దనోట్ల రద్దు అనంతర నిబంధనల ప్రకారం, వారానికి రూ.24 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఈ పరిమితిని రూ.50 వేలకు పెంచారు. కాగా, జనవరి 30న జారీ చేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రా లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి సేవింగ్స్ ఖాతాదారులు వారానికి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. వచ్చే నెల 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు విత్ డ్రాపై ఎటువంటి పరిమితులు లేవు.