: శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది: ఆమ్ ఆద్మీ పార్టీ


బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి శశికళను తమిళనాడు జైలుకు తరలించాలనే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడు విభాగం పేర్కొంది. ఆ విధంగా చేస్తే కనుక తమిళనాడు రాష్ట్రానికి ముప్పు తప్పదని పేర్కొంది. ఆప్ నాయకుడు సుందర పాండ్యన్ మాట్లాడుతూ, శశికళను చెన్నై లేదా తమిళనాడులోనే ఏదైనా జైలుకు తరలించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఆమెను బెంగళూరు జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరు హై కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తిరుప్పూరులో నిన్ని జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానించారు.

  • Loading...

More Telugu News