: ఏపీ అసెంబ్లీ హాల్‌లో 231, మండలిలో 90 సీట్లు.. వెల్లడించిన సీఆర్‌డీఏ కమిషనర్ కార్యాలయం


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ హాల్‌లో సభ్యులకు 231 సీట్లు, మండలిలో 90  సీట్లు ఏర్పాటు చేసినట్టు సీఆర్‌డీఏ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రూ.515 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆరు భవనాల సివిల్ పనులకు దాదాపు రూ.715 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.  అలాగే మౌలిక వసతులు, ఫర్నిచర్, ఆడియో, వీడియో వ్యవస్థ, లైటింగ్, ఏసీ, కాన్ఫరెన్స్ హాళ్ల కోసం చేసిన ఖర్చులను వివరంగా తెలిపింది. ఆరు భవనాల్లోనే పబ్లిక్ అడ్రస్ వ్యవస్థతోపాటు సీఎం భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా ఒకేసారి సందేశం పంపే ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది. నిర్మాణం  సమయంలో రోజుకు సగటున 2,400 మంది కార్మికులు, 130 మంది ఇంజినీర్లు పనిచేసినట్టు సీఆర్‌డీఏ కార్యాలయం పేర్కొంది.

  • Loading...

More Telugu News