: గొప్ప దేశాన్ని సృష్టించే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా


భద్రతతో కూడిన ఒక గొప్ప దేశాన్ని సృష్టించే పనిలో తన భర్త డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ సమృద్ధితో అలరారే దేశాన్ని ట్రంప్ సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికన్లు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగి, విజయం సాధించగలిగే దేశాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. అమెరికాలో భిన్న రాజకీయాలు ఉన్నప్పటికీ ప్రజలు కలిసే ఉన్నారని అన్నారు. ఐకమత్యానికి ఇది ప్రతీక అని కొనియాడారు. విపక్షాలు తన గురించి ఎన్నో విమర్శలు చేశాయని పేర్కొన్న మెలానియా, తాను మాత్రం తన మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. ప్రజల పట్ల ఎప్పుడూ నిజాయతీగా నడుచుకుంటానని తెలిపారు. అమెరికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని మెలానియా వివరించారు.

  • Loading...

More Telugu News