: అందుకే, ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తున్నారు: నాదెండ్ల


తెలుగుదేశం పార్టీ పడిపోతోందని, ఆ పార్టీని మళ్లీ బతికించాలంటే ఎన్టీఆర్ పై బయోపిక్ తీయడమే మార్గమని భావించారని, అందుకే, ఈ చిత్రం తీస్తామని ప్రకటించారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కృష్ణుడు, రాముడు.. బొమ్మలు అన్నీ చూపిస్తే, పిచ్చి జనం అంతా మళ్లీ వస్తారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పై బయోపిక్ మొదలు పెట్టారు. ఇది మొదలు పెట్టింది చంద్రబాబు. వియ్యంకుడు బాలకృష్ణ ను పిలిచి సినిమా తీయాలని చెప్పాడు. వియ్యంకుడికి సినిమా బాధ్యతలు అప్పజెబితే... చంద్రబాబు తన కొడుకుని మంత్రి చేసుకోవచ్చు. మంత్రి పదవి కొడుక్కి ఇవ్వాలా? వియ్యంకుడికా? బాలకృష్ణ ఏమో ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకేమో ఎమ్మెల్యే కాదు. కనుక, మంత్రి పదవి తన కొడుక్కి ఇవ్వాలంటే.. బాలకృష్ణను పక్కకు తోసెయ్యాలి. మరి, పక్కకు తోసెయ్యాలంటే.. బాలకృష్ణను సినిమా తీయమని, కావాలంటే డబ్బులు తీసుకోమని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల భాస్కరరావు. 

  • Loading...

More Telugu News