: మాజీ సీజేఐ అల్తామస్ కబీర్ కన్నుమూత!


అనారోగ్యంతో బాధపడుతున్నసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ (68) మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోల్ కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఓ న్యాయ నిష్ణాతుడిని కోల్పోయామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన ట్వీట్ లో పేర్కొన్న మమత, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కాగా, కోల్ కతాలో 1948, జులై 19న ఆయన జన్మించారు. కోల్ కతా యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ, ఎంఏ పూర్తి చేశారు. 1990లో కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగాను, 2005 మార్చి 1న జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
 

  • Loading...

More Telugu News