: నిన్న జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే అవమానకరం: వెంకయ్యనాయుడు
తమిళనాడు అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే అవమానకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సభ్యులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా, తమిళనాడు కొత్త సీఎం పళనిస్వామి నిన్న అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో ప్రతిపక్ష సభ్యులు విధ్వంసం సృష్టించారు. మైక్ లను, కుర్చీలను విరగ్గొట్టడమే కాకుండా, స్పీకర్ ధన్ పాల్ పట్ల డీఎంకే సభ్యులు అమర్యాదకరంగా ప్రవర్తించారు.