: రానా...సూపర్.. శుభాకాంక్షలు: దర్శకుడు రాజమౌళి


ఇటీవల విడుదలైన ‘ఘాజీ’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో రాజమౌళి ఓ ట్వీట్ చేశారు. కెప్టెన్, ఆయన బృందం నటించిన తీరు అద్భుతమని, తెర ముందు, వెనుక కూడా ‘ఘాజీ’ టీమ్ అద్భుతంగా పనిచేశారని, రానాకు కంగ్రాట్స్ చెబుతున్నానని రాజమౌళి పేర్కొన్నారు. కాగా, 1971లో ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థానీ జలాంతర్గామీ ఘాజీ మధ్య జరిగే యుద్ధం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఓంపురి, నాజర్, కెకె మీనన్, అతుల్ కులకర్ణి, తాప్పి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News