: కోమటిరెడ్డి అలా చేస్తారని అనుకోను: దిగ్విజయ్ సింగ్


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని తాను భావించడం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తలపెట్టిన 'జన ఆవేదన సమ్మేళన్' కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం నాడు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన అంతర్గత విభేదాలు త్వరలోనే సమసిపోతాయని, నేతలంతా ఏకతాటిపైనే ఉన్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించాయని దిగ్విజయ్ విమర్శించారు. కేసీఆర్ వ్యవహారశైలిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే జన ఆవేదన సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News