: త్వరలోనే ఎన్నికలు... పళని ప్రభుత్వానికి పోయే కాలం: స్టాలిన్
తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం ఎన్నో రోజుల పాటు అధికారంలో ఉండబోదని, త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని డీఎంకే నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. పళని ప్రభుత్వానికి అప్పుడే పోయేకాలం దాపురించిందని విమర్శించిన ఆయన, నిన్న అసెంబ్లీలో జరిగిన అల్లర్లపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఉదయం డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమై అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయన చర్చించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని, దీనికి నిరసనగా ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నట్టు వెల్లడించారు.