: ఓ కసాయిలా వ్యవహరిస్తున్న చంద్రబాబు: నిప్పులు చెరిగిన రఘువీరా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసాయిలా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రజలు కరవుతో అల్లాడుతుంటే, ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల రైతులు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని గుర్తు చేసిన ఆయన, చంద్రబాబు ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. సరైన తిండి, నీరు లేక లక్షలాది పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, చంద్రబాబు స్పందించకుంటే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం ఖాయమని హెచ్చరించారు.