: హీరోయిన్ భావన కిడ్నాప్ పై స్పందించిన కేరళ సీఎం విజయన్
దక్షిణాది హీరోయిన్ భావనను ఆమె కారు మాజీ డ్రైవరే కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడటంపై కేరళ సీఎం పినరాయి విజయన్ స్పందించారు. కేసులో తప్పించుకున్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కారు డ్రైవర్ మార్టిన్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మాజీ డ్రైవర్ సునీల్ సహా మరికొందరు గుర్తు తెలియని నిందితులు పారిపోయిన సంగతి తెలిసిందే.