: అమెరికాలో పెను తుపాను.. నలుగురి మృతి.. 300 విమానాల రద్దు


అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాను తుపాను బెంబేలెత్తిస్తోంది. తుపాను దాటికి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. అప్రమత్తమైన అధికారులు 300 విమానాలను రద్దు చేశారు. జాతీయ రహదారులను మూసివేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వరదలో కార్లు కొట్టుకునిపోయాయి. కాలిఫోర్నియా సహా  పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు గంటకు 70 కిలోమీటర్ల  వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. భారీ వృక్షాలు నేల కూలాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News