: ఈరోమ్ షర్మిలకు రూ. 50 వేలిచ్చిన కేజ్రీవాల్


మణిపూర్ రాజకీయాల్లోకి ప్రవేశించి, పీపుల్స్ రీసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ (ప్రజా) పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగిన ఈరోమ్ షర్మిలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రూ. 50 వేలను విరాళంగా ఇచ్చారు. ప్రజలు విరివిగా ఆమె పార్టీకి విరాళాలివ్వాలని, ఆమెకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమెకు తానిచ్చిన మొత్తం చిన్నదేనని, ప్రతి ఒక్కరూ షర్మిలకు సపోర్టుగా నిలవాలని ఆయన కోరారు. కాగా, గత సంవత్సరంలో తన 16 సంవత్సరాల నిరాహారదీక్షను ఆమె విరమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News