: అవును.. నేను ముఖ్యమంత్రిని అవుతా..!: కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతున్న సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా కనగల్‌లో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని పేర్కొన్నారు. అయితే ఎప్పుడు అవుతానో ఇప్పటికిప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన, 90 సీట్లు సాధించి సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఒకటేనన్నకోమటిరెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీకి డబ్బులు ఉండవు కానీ పేపర్, టీవీ ప్రకటనలకు మాత్రం రూ.940 కోట్లు ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పాదయాత్ర నిర్వహిస్తానని, కేసీఆర్ అబద్ధాలు, మోసాలను ప్రజల సమక్షంలో ఎండగడతానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News