: రెండు నెలల క్రితమే ప్లాన్... పాత కక్షల నేపథ్యంలోనే హీరోయిన్ భావనపై అత్యాచారం!
తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్ భావన అత్యాచార కేసులో మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. గతంలో విభేదాలు వచ్చి ఆమె తీసేసిన డ్రైవర్ సునీల్ కుమార్, పాత పగను మనసులో పెట్టుకుని, రెండు నెలల క్రితమే కిడ్నాప్ ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె త్రిసూర్ లో షూటింగ్ లో ఉందని తెలుసుకుని ప్రస్తుత డ్రైవర్ మార్టిన్ తో కలసి ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారని తెలిపారు.
శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆమె కారులో వెళుతుండగా, టెంపోలో నిందితులు ఫాలో అయ్యారని, నెడుంబాసరే విమానాశ్రయం సమీపంలో ఆమె కారును ఢీకొట్టి కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆపై దాదాపు గంటన్నర పాటు ఆమెను బలాత్కరించారని, ఈ కేసులో ఫిర్యాదు అందుకుని ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని, సునీల్ కు నేర చరిత్ర ఉందని, పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు, దారుణానికి పాల్పడ్డ ఇతర దుండగులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.