: సొంత జిల్లాలోనే పళనికి వ్యతిరేకత... స్వీట్లు పంచితే తీసుకోని ప్రజలు
తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి, నిన్న అనూహ్య పరిస్థితుల మధ్య బల నిరూపణలో విజయం సాధించిన ఎడప్పాడి కే పళనిస్వామికి సొంత జిల్లాలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన అసెంబ్లీ బలపరీక్షలో విజయం సాధించారని తెలుసుకున్న కొందరు అనుచరులు, కార్యకర్తలు సేలం జిల్లాలో బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచగా, వాటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించారని తెలుస్తోంది. వారు శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ప్రజల మనోభావాలను పక్కనబెట్టి, అధికారాన్ని పొందారని ప్రజలు విమర్శించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం పళని ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం గమనార్హం.