: ఆమె దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా, ఏమిటీ? జైలుకొస్తే ఎవరైనా నేరస్థులే!: శశికళపై కర్ణాటక డీజీపీ కామెంట్


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో శిక్ష ఖరారై, ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళ విషయంలో మీడియా మరీ ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోందని కర్ణాటక డీజీపీ సత్యనారాయణ రావు వ్యాఖ్యానించారు. ఆమేమైనా దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా? అని ప్రశ్నించిన ఆయన, జైలుకొచ్చే వారంతా నేరస్థులేనని డేర్ కామెంట్స్ చేశారు. ఆమెకు మీడియా ప్రాధాన్యత తగ్గించాలని, పరప్పన అగ్రహార జైలులో ఏ, బీ అంటూ రెండు రకాల గదులు ఉండవని, జైల్లోని గదులన్నీ ఒకేలా ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా ఖైదీలంతా ఉన్నట్టుగానే శశికళ కూడా ఉన్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News