: నితిన్ గడ్కరీ ఇంట్లో దొంగలు పడ్డారు!
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో దొంగలు పడ్డారు. అత్యంత భద్రతతో కూడిన రక్షణ ఉండే చోట ఆయన పర్సనల్ అసిస్టెంట్ మనోజ్ కుమార్ ఇన్నోవా కారును దొంగిలించారు. ఆపై కొంత దూరం వెళ్లిన తరువాత దాని జీపీఎస్ మాడ్యూల్ ను తొలగించడంతో, కారు ఎటువైపు వెళ్లిందో పోలీసులకు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దర్యాఫ్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగలను గుర్తిస్తామని తెలిపారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.