: పవన్ సభ పేరు మార్పు...వేదిక ఏర్పాట్లు షురూ!


ఈ నెల 20న గుంటూరు జిల్లాలో జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్న బహిరంగ సభకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. మొదట్లో ఈ సభకు 'పద్మశాలి గర్జన' అనే పేరును నిర్ణయించినప్పటికీ,  తాజాగా దీనిని 'చేనేత గర్జన'గా మారచినట్టు నిర్వాహకులు తెలిపారు. 18 కులాల అనుబంధంగా నడుస్తున్న ఈ సభకు 'చేనేత గర్జన' అని పెట్టడమే సరైనదని వారు తెలిపారు. ఈ సభకు 80,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అందుకుతగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని, సభ విజయవంతమవుతుందని, ఏర్పాట్లు రేపు సాయంత్రానికి పూర్తవుతాయని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News