: టీమిండియాకు సవాల్ విసిరేందుకు ఆసీస్ రెడీ
ముంబై వేదికగా ఇండియా ఏ- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ లో ఆసీస్ ఆకట్టుకుంది. భారత్ లో ఆసీస్ కు గట్టి పోటీ ఎదురవుతుందని, వరుస టెస్టుల్లో విజయం సాధిస్తూ మంచి జోరుమీదున్న భారత్ కు అడ్డుకట్ట వేయడం అంత సులభం కాదన్న అంచనాల మధ్య భారత్ లో అడుగుపెట్టి మూడురోజుల సన్నాహక మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ మంచి ప్రదర్శన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్లు రెవిడ్ వార్నర్ (25), రెన్ షా (11) స్వల్ప స్కోర్లకే అవుటైనప్పటికీ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (107 నాటౌట్), షాన్ మార్ష్ (59 నాటౌట్) అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ సమర్థవంతంగా భారత్ ఏ బౌలర్లను అడ్డుకుంటున్నారు. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
భారత్ టూర్ కు వచ్చే ముందు యూఏఈలో చేసిన ప్రాక్టీస్ ఆ జట్టుకు బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడ చేసిన ప్రాక్టీస్ కారణంగా భారత వాతావరణం, పిచ్ లకు ఆసీస్ ఆటగాళ్లు అలవాటుపడ్డట్టు తెలుస్తోంది. భారత్ 'ఏ'తో ప్రదర్శన సందర్భంగా బ్యాటింగ్ తో భారత జట్టును ఆశ్చర్యపరిచేందుకు తెలిపినట్టైంది. అంతే కాకుండా తమపై గెలవడం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లపై గెలిచినంత తేలిక కాదని ఆసీస్ హెచ్చరికలు పంపింది.