: కోమటిరెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలంటున్న కాంగ్రెస్ నేతలు


కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు మల్లు రవి, జగ్గారెడ్డి, బలరాం నాయక్, దాసోజు శ్రవణ్ లు డిమాండ్ చేశారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో వారు మాట్లాడుతూ, కోమటిరెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేయిస్తే దానిని బోగస్ సర్వే అంటూ కోమటిరెడ్డి మాట్లాడటం సరికాదని వారు హితవు పలికారు. ఆయన ఆరోపణల వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని వారు ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన కోమటిరెడ్డిపై అధిష్ఠానం చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News