: ఆ హత్య గురించిన షాకింగ్ నిజాలు వెల్లడించిన మలేసియా అధికారులు


ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉల్ సవతి సోదరుడు కిమ్‌ జోంగ్-నామ్‌ మలేసియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అతను విషప్రయోగంతో హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. నిందితులను వీడియో పుటేజ్ సాయంతో పట్టుకున్న పోలీసులు షాక్ కు గురయ్యే వాస్తవాలను వెల్లడించారని తెలిపారు. అక్కడి పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....కిమ్ జోంగ్ నామ్ ను ఇద్దరు మహిళలు హత్య చేశారు.

నిందితుల్లో ఒకరైన ఇండోనేషియాకు చెందిన సీతీ అయిస్యాహ్‌ (25) ను మలేసియాలో అదుపులోకి తీసుకుని ఆమెను విచారించిన వివరాలు ఇండోనేసియా పోలీసులకు పంపారు... ఇందులో...ఇంగ్లీష్ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘‘జస్ట్ ఫర్ లాఫ్స్‌’’ అనే హిడెన్ కెమెరా షో తరహా సన్నివేశంలో పాల్గొంటున్నట్లుగా తనను ఈ హత్యలో భాగం చేశారని చెప్పింది. పురుషులను కళ్ళు మూసుకునేలా చేసి, వారిపైకి నీళ్ళు జల్లడం అనే సన్నివేశమని తనకు తెలిపారని ఆమె వెల్లడించింది. దీంతో వారు తనకు చెప్పిన పురుషులపై నీళ్లు చల్లాల్సి ఉంటుందని తెలిపింది. అలా తనకు స్ప్రేలు ఇచ్చి నలుగురు పురుషులపై చల్లించారని చెప్పింది.

వారంతా బాగానే ఉన్నారని, తరువాత జస్ట్ ఫర్ లాఫ్ లోలా... తనకు హిడెన్ కెమెరా చూపించారని, తాను అవాక్కయ్యేలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చానని తెలిపింది. ఐదో వ్యక్తిగా కిమ్ జోంగ్ నామ్ పై చల్లాలంటూ ఒక స్ప్రే ఇచ్చారని సీతీ అయిస్యాహ్ తెలిపింది. అయితే వారు తనకు ఇచ్చిన బాటిల్ లో విషం ఉందన్న విషయం తనకు తెలియదని, అంతకు ముందులానే నీళ్లు ఉంటాయని తాను భావించానని ఆమె తెలిపింది. కాగా, ఆమె బంధువులు కూడా ఆమె చిన్న కామెడీ సినిమాలో నటించేందుకు చైనా వెళ్లిందని చెప్పారు. అయితే ఆమె పాస్ పోర్టు ప్రకారం ఆమె చైనాతో పాటు మలేసియా తదితర దేశాలకు వెళ్లినట్టు తెలుస్తోందని చెప్పారు. 

  • Loading...

More Telugu News