: పన్నీరు వర్గంపై అనర్హత వేటు... స్పీకర్ సీట్లో కూర్చున్న వారిపై సస్పెన్షన్ వేటు?
తమిళనాడులో గత మూడు వారాలుగా పెరిగిన ఉత్కంఠకు నేడు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ వారం రోజులు అధికారం కోసం జరిగిన పోటీలో పళనిస్వామి వర్గం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరికొత్త వ్యూహాలు ఊపిరిపోసుకుంటున్నాయి. పన్నీర్ సెల్వం, స్టాలిన్ తో తీవ్రంగా విభేదించిన శశికళ వర్గం అసెంబ్లీలో ఘర్షణకు దిగినంత పని చేసింది. అధికారం ఉపయోగించి మార్షల్స్ తో వారిని బయటకు నెట్టేయడంపై ఆ రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో మరుసటి క్షణం నుంచే ఆ రెండు వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు.
అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లిన స్టాలిన్ జరిగిన పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గాంధీ బీచ్ కు వెళ్లిన ఆయన దీక్షకు దిగారు. అక్కడ రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క, పన్నీర్ సెల్వం వర్గానికి షాకిచ్చేందుకు పళనిస్వామి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పార్టీ విప్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై అనర్హత వేటు వేయనున్నారు. అలాగే అసెంబ్లీలో నిబంధనలు ఉల్లంఘించి స్పీకర్ ఛైర్ లో కూర్చున్న ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయనున్నారు.