: మూడు వారాలుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర
గత మూడు వారాలుగా పసిడి ధర పెరుగుతూ పోతుండడంపై వ్యాపారవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. డిమాండ్ పెరుగుతుండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఈరోజు పది గ్రాముల బంగారం 155 రూపాయలు పెరిగి 29,880 రూపాయలకు చేరుకుంది.
ఇక వెండి ధర కూడా పెరుగుతోంది. కేజీ వెండి 400 రూపాయలు పెరిగి 43,450 రూపాయలకు చేరుకుంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిందని బులియన్ మార్కెట్ చెబుతోంది. దీంతో, ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములు 29,950 కాగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాముల ధర 29,800 రూపాయలని బులియన్ మార్కెట్ తెలిపింది.