: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్ కార్యాలయంపై డీఎంకే కార్యకర్తల దాడి
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, తమ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు రహస్య ఓటింగ్ జరపనందుకు స్పీకర్ ధన్‌పాల్ పై డీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయానికి వెళ్లి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు చెన్నైలోని పలు ప్రాంతాల్లో డీఎంకే నేతల ఆందోళనలతో ట్రాఫిక్ జాం ఏర్పడినట్లు తెలుస్తోంది. తమ నాయకుడు మెరీనా బీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద చేస్తోన్న దీక్షకు మద్దతుగా భారీ ఎత్తున కార్యకర్తలు మెరీనా బీచ్ వద్దకు చేరుకుంటున్నారు.