: విజయ గర్వంతో మెరీనాబీచ్ కు బయలుదేరి ‘అమ్మ’కు నివాళులర్పించిన పళనిస్వామి
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన మంత్రివర్గ సభ్యులతో కలిసి విజయగర్వంతో చెన్నై మెరీనా బీచ్ వద్ద ఉన్న అమ్మ జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అమ్మ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఆమెకు నివాళులర్పించారు. చివరకు ధర్మమే గెలిచిందని ఈ సందర్భంగా మంత్రులు వ్యాఖ్యానించారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. బలపరీక్ష నెగ్గడంతో పళనిస్వామి వర్గ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.