: చిరిగిన చొక్కాతోనే గవర్నర్ తో భేటీ అయిన స్టాలిన్.. అనంతరం మెరీనా బీచ్ వద్ద ధర్నా!
అసెంబ్లీ నుంచి తనను బలవంతంగా మార్షల్స్ బయటకు మోసుకువచ్చిన తరువాత మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే కార్యనిర్వాహ అధ్యక్షుడు స్టాలిన్ అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. చిరిగిన చొక్కాతోనే ఆయన గవర్నర్ ముందు కూర్చొని అసెంబ్లీలో జరిగిన తీరుని వివరించారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని, తనను బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. అనంతరం ఆయన మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు ధర్నాకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.