: కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారు.. కుటుంబ సమేతంగా వెళ్లనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారయింది. ఈ నెల 21వ తేదీన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను మొక్కుకున్న మొక్కులను ఈ సందర్భంగా ఆయన చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు.