: మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఇదొక భాగం: పన్నీర్ సెల్వం
నేటి శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. శాసనసభలో పళనిస్వామి విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శాసనసభలో మాఫియా తిష్ఠవేసిందని అన్నారు. న్యాయం కోరితే దాడి చేశారని చెప్పారు. అమ్మ అశయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు నడుచుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లేకుండా ఓటింగ్ జరపడం సరైన విధానం కాదని ఆయన చెప్పారు. అన్యాయంగా కొట్టి, తిట్టి బయటకు నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.