: చిరిగిన చొక్కాతో పోజులిస్తున్న స్టాలిన్!
డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా జరిగిన అసాంఘిక పరిస్థితులను ఆయన ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో మీడియాను నియంత్రించి తనపై దాడి చేశారంటూ చిరిగిన చొక్కాను మీడియాకు చూపిస్తున్నారు. కారు దిగుతూనే ఆయన చినిగిన చొక్కాను కెమెరాలకు చూపిస్తూ మీడియాకు పోజులిచ్చారు. దీంతో తమిళనాడు శాసనసభలో చోటుచేసుకున్న పరిస్థితులపై ప్రజలకు ఒకవిధమైన స్పష్టతనిస్తున్నారు. ఆయన కారు దిగుతూ చిరిగిన చొక్కాను చూపిస్తున్న దృశ్యాలను టీవీలలో పదేపదే చూపిస్తున్నారు.