: గవర్నర్ ను కలిసేందుకు బయల్దేరిన స్టాలిన్!


తమిళనాడు అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు బయల్దేరారు. తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించిన ఆయన స్పీకర్ పక్షపాత ధోరణి పట్ల మండిపడ్డారు. మీడియాలో సభ ప్రారంభమైన మొదట్లో చోటుచేసుకున్న పరిణామాలు చూపించారని, తమపై దాడి సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను మీడియాలో చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు. ఈ సందర్భంగా చిరిగిన చొక్కాలతోనే తమ శాసనసభ్యులతో కలసి రాజ్ భవన్ కు వెళ్లారు. జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News