: డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు లాగుతున్న మార్షల్స్.. అసెంబ్లీలో నానా హంగామా
తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్పీకర్ ధన్‌పాల్ డీఎంకే నేతలను సభనుంచి బహిష్కరించి, సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభనుంచి బయటకు వెళ్లని డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు పంపాలని స్పీకర్ నుంచి ఆదేశాలు అందుకున్న మార్షల్స్ రంగంలోకి దిగి ఆ పనిలో పడ్డారు. అయితే, సభ నుంచి బయటకు వెళ్లబోమని తెగేసి చెబుతూ డీఎంకే సభ్యులు మార్షల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో మార్షల్స్, డీఎంకే ఎమ్మెల్యేలకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం మార్షల్స్.. డీఎంకే నేతలను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలోపల ఎమ్మెల్యేలు చించి విసిరేసిన పేపర్ల కుప్పలు, పడిపోయి ఉన్న చైర్లు కనిపించాయి.