: నా చొక్కా చింపి నన్ను అవమానించారు: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
వాయిదా అనంతరం తమిళనాడు శాసనసభ తిరిగి ప్రారంభం అవ్వడమే ఆలస్యం.. మళ్లీ గందరగోళం నెలకొంది. శాసనసభలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల దృష్ట్యా స్పీకర్ ధన్‌పాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగానే తాను సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. తన చొక్కా చింపి తనను అవమానించారని ఆయన అన్నారు. ఇదిలా వుండగా, అసెంబ్లీ లోపలికి కూడా పోలీసులు వచ్చేశారు.