: వాయిదా అనంతరం ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ!
రాష్ట్ర శాసనసభలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టిన ప్రతిపక్ష పార్టీలను పట్టించుకోకుండా స్పీకర్ ధన్‌పాల్ వారి వినతిని తిరస్కరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో సభను ఒంటిగంటవరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. శాసనసభలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సభలో రహస్య ఓటింగ్ మాత్రమే జరగాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడి బీభత్సం సృష్టిస్తుండడంతో మళ్లీ ఏం జరగబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.