: శాసనసభలో బెంచ్ ఎక్కి మరీ నిరసన తెలిపిన డీఎంకే ఎమ్మెల్యే అరుణ
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రహస్య ఓటింగ్ మాత్రమే జరగాలని పట్టుబట్టిన ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతలు సభలో ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా పడడానికి ముందు జరిగిన ఈ పరిణామంలో డీఎంకే ఎమ్మెల్యే పొంగొత్తై అలాడి అరుణ అత్యుత్సాహం ప్రదర్శించారు. శాసనసభలో బెంచ్ ఎక్కి మరీ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. రహస్య ఓటింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రక్రియ కొనసాగాలని ఆమె తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యే కుక్వా సెల్వం స్పీకర్ చైర్ లో కూర్చొన్న విషయం తెలిసిందే.